calender_icon.png 25 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిలో మాణిక్యాలు గిరిజన బిడ్డలు

25-09-2025 12:00:00 AM

అక్కాచెల్లెళ్లకు ఎంబీబీఎస్, జేఈఈ మెయిన్స్‌లో సీటు 

మఠంపల్లి, సెప్టెంబర్ 24 :  మండలంలోని భీల్యానాయక్ తండా మాజీ సర్పంచ్ ధరవతు నాగమణి, నవీన్ నాయక్ ఇద్దరు కుమార్తెలు. తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో చిన్ననాటి నుండి శ్రద్ధగా చదివించారు. అయితే కుమార్తెలు కూడా పట్టుదలతో చదివి ఎంబిబిఎస్, జెఈఈ మెయిన్స్ లో సీటు సాధించారు.పెద్ద కుమార్తె ధరవతు స్పందన డాక్టర్ కావాలనే లక్ష్యంతో పదవ తరగతిలో 10జిపిఎకు 10జిపిఎ సాధించి అందరి మన్ననలు పొందారు.

ఇంటర్ లో 1000 మార్కులకు గాను 984 సాధించి మరో మారు శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా దేశంలో అత్యంత కఠినమైన నీట్ పరీక్ష లో అర్హత సాధించి ఈ మధ్య వెలువడిన రిజలట్స్ లో ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించారు. అదేవిధంగా రెండో కూతురు ధరావత్ అమృత జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్ ఫలితాల్లో గిరిజన బిడ్డ  ఉత్తమ ప్రతిభను కనబరిచింది.

ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరిలో టాప్ టెన్ కాలేజీ అయినా జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ ఐఐటీ కళాశాల నందు సిఎస్సి సీటు సాధించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఐఐటి కళాశాలలో సీటు సాధించిన అక్కాచెల్లెళ్ళు నిరుపేద విద్యార్థులకు, తండాలోని విద్యార్థులకు ఆదర్శమని పలువురు ఉద్యోగ సంఘ నాయకులు, లంబాడీ సంఘ నాయకులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.