24-07-2025 01:32:11 PM
మాస్కో: రష్యాలో అంగారా ఎయిర్ లైన్స్(Russia Angara Airlines Crash) చెందిన ఏఎన్-24 విమానం కుప్పకూలింది. రష్యా-చైనా సరిహద్దులోని టిండా సమీపంలో విమానం కుప్పకూలింది. గమ్యస్థానానికి 15 కిలో మీటర్ల దూరంలో విమానం కూలింది. 50 మంది ప్రయాణికులతో అంగారా ఎయిర్ లైన్ విమానం బయలుదేరింది. రష్యా తూర్పు ప్రాంతంలో విమాన శిథిలాలు గుర్తించారు. రష్యన్ విమానం కూలిపోయిన ఘటనలో 49 మంది మొత్తం 49 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. ల్యాండింగ్ సమయంలో మంటల్లో ఉన్న విమానం దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
సైబీరియాకు చెందిన అంగారా అనే విమానయాన సంస్థ నడుపుతున్న విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు పెద్ద పొగ మేఘాలతో పాటు దుమ్ము కూడా కమ్ముకున్నట్లు స్టేట్ టెలివిజన్ న్యూస్ ఆర్టీ షేర్ చేసిన 17 సెకన్ల క్లిప్ చూపిస్తుంది. విమాన ఫ్యూజ్‌లేజ్ మంటల్లో చిక్కుకున్నట్లు నివేదికలు సూచించాయి. అముర్ ప్రాంతంలో శిథిలాలు కనుగొనబడ్డాయి. ఆంటోనోవ్-24 విమానం బ్లాగోవెష్‌చెన్స్క్ నగరం నుండి చైనా సరిహద్దులోని అముర్ ప్రాంతంలోని టిండా నగరానికి వెళుతుండగా రాడార్ నుండి అదృశ్యమైందని ప్రాంతీయ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ టెలిగ్రామ్‌లో రాశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని మిస్టర్ ఓర్లోవ్ చెప్పారు. ప్రమాదంలో వారందరూ మరణించారు.