calender_icon.png 24 October, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ వరం

24-10-2025 12:03:27 AM

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

 భూత్పూర్, అక్టోబర్ 23 : పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఒక వరం లాంటివని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సైన్స్ లాబ్ ను ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక వద్ద మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కు చెందిన ముదిరాజ్ సోదరులకు నూతన సభ్యత్వాల ప్రొసీడింగ్స్ లను పంపిణీ చేశారు.

అదే గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిషన్, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్. భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు హర్యానాయక్, నర్సింలు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.