calender_icon.png 15 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రోస్టేటైటిస్‌తో జర భద్రం

15-07-2025 01:04:33 AM

  1.    30--50 ఏళ్ల మధ్య వారిలో వచ్చే అవకాశం
  2. లక్షణాలు గమనించి చికిత్స చేయిస్తే మందులతో నయం
  3. ఏఐఎన్యూ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): మగవారిని చాలా ఎక్కువగా వేధించే సమస్యల్లో ప్రోస్టేట్ సమస్యలు ముందుంటాయని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూ రాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. “30 నుంచి 90 ఏళ్ల వరకు ఉండే చాలామంది యూరాలజిస్టుల వద్దకు ఈ సమస్యతో వస్తుంటారు.

ఎక్కువమందికి ప్రోస్టేట్ క్యాన్స ర్, ప్రోస్టేట్ పెరగడం లాంటివి తెలుసుగానీ చాలామందికి తెలియని మరో ముఖ్య సమ స్య” అని చెప్పారు. “ప్రోస్టేటైటిస్ సమస్య 30 సంవత్సరాల మధ్య వయసున్న పురుషుల్లో సుమారు 10--12శాతం మందికి వస్తుంది. భారతీయుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ల్యాబ్ పరీక్షలు, స్కాన్ల కంటే భౌతికంగా కనిపించే లక్ష ణాల ఆధారంగానే దీన్ని నిర్ధారిస్తాం. చాలావరకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంది. ఇంకా అరక్షిత శృంగారం, మూత్రమార్గ సంకోచం, ప్రోస్టేట్ పెరగడం.. ఇలాం టి వాటివల్ల కూడా వస్తుంది. టీబీ కూడా ఒక కారణం కావచ్చు” అని తెలిపారు. 

లక్షణాలు ఇవీ..

ప్రోస్టేటైటిస్ ఉన్నవారికి తరచు మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి పుడ తాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుం ది. వృషణాల్లో అసౌకర్యంగా అనిపిస్తుంది. అంగస్తంభన తర్వాత నొప్పి పుడుతుంది. కొందరికి అంగస్తంభన సరిగా ఉండదు, వీర్యంలో రక్తం పడుతుంది. ఇవి తీవ్రమైన సమస్యల్లా కాకుండా.. ఎక్కువకాలం ఉండి చికాకు పెడతాయి.

దాంతో చాలామంది వెంటనే యూరాలజిస్ట్ వద్దకు వెళ్లరు. ప్రోస్టేటైటిస్ తీవ్రంగా ఉంటే మూత్రవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉండి, తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ లక్షణాలు ఏవైనా కనపడితే పురుషులు వెంటనే తప్పనిసరిగా అను భవజ్ఞులైన యూరాలజిస్టులను సమయానికి సంప్రదించి, తగిన చికిత్స పొందాలి.

చికిత్స ఇలా..

ప్రోస్టేటైటిస్‌ణు మందులతోనే నయం చేయొచ్చు. మందులు నెమ్మదిగా పనిచేస్తా యి. 4-6 వారాల పాటు వాడాలి. లక్షణాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి కూడా. ప్రోస్టేటైటిస్ తీవ్రంగా ఉండి పుండులా అయితే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలి. దీర్ఘకాలం పాటు ప్రోస్టేటైటిస్ ఉంటే కొన్నేళ్ల పాటు లక్షణాలు కొనసాగుతూ చికిత్స కష్టమవుతుంది.