calender_icon.png 15 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా ‘సేవ్ ది ఉటేరస్’

15-07-2025 01:01:59 AM

ఓజోన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ఉమెన్స్ హెల్త్‌పై దృష్టి సారి స్తూ, ఓజోన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13న రెండు రోజులపాటు ‘సేవ్ ది ఉటేరస్‘ హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రఖ్యాత గైనకాలజిస్టులు, ల్యాపరోస్కోపిక్ సర్జన్లు పాల్గొని అత్యాధునిక సాంకేతికతలపై శిక్షణ పొందారు.

శిక్షణలో భాగం గా లేజర్ పాలిపెక్టమీ, లేజర్ మెట్రోప్లాస్టీ, ఫిగో 0,1,2 కొరకు లేజర్ ఎన్యుక్లియేషన్ స్టెమ్ సెల్ థెరపీ, ఎండోమెట్రియం కోసం పీఆర్‌పీ ఇంజెక్షన్ గురించి నేర్పించారు.ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా రెండు ఆధునిక చికిత్సా విధానాలు ప్రదర్శించబడ్డాయి. 

ల్యాపరోస్కోపిక్ అసిస్టెడ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ మైక్రోవేవ్ అబ్లేషన్

ఉటేరస్ ఫైబ్రాయిడ్స్, అడెనోమయోసిస్ ఉన్న మహిళలకు గర్భాశయాన్ని తొలగించకుండా చికిత్స చేసే సురక్షిత, ఫర్టిలిటీ-సేవింగ్ టెక్నిక్. ఈ పద్ధతిలో అల్ట్రాసౌండ్ గైడెన్స్‌లో హై ప్రిసిషన్ చికిత్స సాధ్యమవుతుంది - రక్తస్రావం తక్కువగా ఉండి, త్వరితంగా కోలుకోవచ్చు.

ఎంఐఎస్ హిస్టెరోస్కోపిక్ లేజర్ సర్జరీ

ఈ శిక్షణలో లేజర్ సాంకేతికత ద్వారా పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, అసాధారణ బ్లీడింగ్ సమస్యలకు ఆధునిక చికిత్సా మార్గాలు చూపించబడ్డాయి. శిక్షణను నిపుణులైన డాక్టర్ శంకర్ నాయిక్, ఎంబీబీఎస్ , ఎంఎస్- మైక్రోవేవ్ సర్జన్, డాక్టర్ జి పూజిత, ఎంబీబీఎస్ డీఎన్‌బీ (Obgyn), ఎంఆర్‌సీఓజీ (యూకే), ఎఫ్‌ఐఐ (IMA-AMS), ఎఫ్‌సీజీ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, ల్యాప్ సర్జన్ నిర్వహించారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణలో గర్భాశయాన్ని కాపాడే మార్గాలను ప్రోత్సహించడమే కాకుండా, ప్రాక్టికల్ శిక్షణ ద్వారా డాక్టర్లకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది వైద్యులు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.