31-10-2025 01:18:30 AM
 
							-డిగ్రీ అతిథి ఉపాధ్యాయులకు 6 నెలలుగా అందని వేతనాలు
-సర్కారు సాయమేదీ?
నిర్మల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి ఉపాధ్యాయులకు వేతన వెతలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న అతిథి ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రతినెల చెల్లించే వేతనం ఆరు నెలలుగా విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ అధ్యాపకులకు ప్రతినెలలు వేతనాలు చెల్లిస్తుండగా అతిథి ఉపాధ్యాయులపై వివక్ష చూపడంతో ఉన్న ఉద్యోగం మానుకే లేక కొత్త ఉద్యోగం రాక వారి పరిస్థితి అగమ్ను గోచరంగా మారుతుంది.
తెలంగాణ రాష్ట్రములో పని చేస్తున్న 1940 డిగ్రీ అతిథి అధ్యాపకులకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక పస్తులుండాల్సి అధ్యాపకులు పేర్కొంటున్నారు. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న డిగ్రీ అతిథి అధ్యాపకులకు సమయానికి వేతనాలు అందక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఆరు నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. ఈరోజు రేపు వస్తాయి అని ఊహల్లో తేలిపోతున్న డిగ్రీ అధ్యాపకులు.నిర్మల్ జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం ముప్పు రెండు మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు విధులు నిర్వ హిస్తున్నారు.
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 12 మంది విధులు నిర్వహి స్తుండగా బైంసా గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8 మంది డిగ్రీ అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. సహాయ అధ్యాపకులతో పాటు వీరు కూడా విధులు నిర్వ హిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. వచ్చే వేతనం కూడా నెల నెల సక్రమంగా రావడం లేదని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబరుతో పాటు అక్టోబరు మాసం కూడా పూర్తవుతుందని ఆయా మాసాలకు చెందిన వేతనాలు అం దడం లేదని అప్పుల ఉబిలో కూరుక పోతున్నారు.
విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తారు, సమయానికి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేస్తున్నామనే సంతృప్తి తప్పా కుటుంబ పోషణ భారంగా మారింది, నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమకు ఇవ్వాల్సిన వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు
హామీలు అమలు చేయాలి
ఎన్నికలకు ముందు అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అతిథి అధ్యాపకులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రతినెల వేతనాలు చెల్లించాలని వారు గుర్తు చేస్తున్నారుఅందజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ మేనిపెస్టో లో పేర్కొన్న విధంగా డిగ్రీ గెస్టు ప్యాకల్టీ లకు ప్రతినెలా 50000 రూపాయలు వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని అది ఎంతవరకు అమలు కావడం లేదన్నారు. అదికూడా కన్సల్దేటెడ్ చేయాలి.
ఇప్పటికి తెలంగాణలోని అన్ని జిల్లాలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అతిథి అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కోసం అనేక పోరాటాలు చేశామని మంత్రులకు ముఖ్యమంత్రి కి తమ సమస్యను విన్నవించామని అయినా తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం ప్రతినెల చెల్లించి అతిధి వేతనం ప్రతి రాకపోవడంతో ఇంటి అద్దె పిల్లల చదువు ఇంటి అవసరాలను తీర్చుకునే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అతిథి ఉపాధ్యాయులు తెలిపారు. ఇచ్చే వేతనమే తక్కువ అని అది కూడా ప్రతి నెల చెల్లించకపోవడం వల్ల ఇంటి అవసరాల కోసం అప్పులు తెచ్చి వడ్డీ కట్టలేని పరిస్థితి నెలకొందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏళ్ల తరబడి అతిధి అధ్యాప కులుగా విధులు నిర్వహిస్తున్న తమ సేవ లను గుర్తించి ప్రతి నెల వేతనం ఇవ్వాలని ఎన్నికల్లో ప్రభు త్వం ప్రకటించిన హామీలను అమలు చేయాలి. రాష్ట్రంలో 1940 మంది అతిథి ఉపాధ్యాయులకు ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బం దులను ఎదుర్కొంటున్నాం.
వెలుమల రంజిత్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు, నిర్మల్
సమయానికి వేతనం రాక
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయులుగా అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ప్రతినెల చెల్లించే వేతనాలు చెల్లించడం లేదు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దె పిల్లల చదువు ఇంటి అవసరాలను తీర్చుకోలేక ఇబ్బందులను పడుతున్నాం. సమయానికి వేతనం రాకపోవడంతో తమ బాధలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలి.
తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వేతనాలు పెంచాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించి పేద విద్యార్థులకు స్కి ల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్న అతిథి ఉపాధ్యాయులపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదు. అతిథి ఉపాధ్యాయులకు ప్రతినెల 50 వేల వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం వెంటనే ఎన్నికల్లో ప్రకటించిన తమ హామీలను నిలబెట్టుకుంటేనే ప్రభుత్వం పై విశ్వాసం ఉంటుంది.
అలుగు నరేందర్ నిర్మల్