10-10-2025 12:17:58 AM
బూర్గంపాడు,అక్టోబర్9,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇసుక నిల్వలు ఉంచి గత కొన్ని రోజులుగా అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రాత్రి పోలీసులు నిఘా పెట్టి ఒక లారీ, జెసిబిని పట్టుకున్నారు.
ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నందున లారీ,జెసిబి ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు. మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.