16-12-2024 03:56:29 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థినీ,విద్యార్థులకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఆనందం, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. సోమవారం అఫిజ్పేట్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థినీ,విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ యూనిఫామ్,నోట్ బుక్స్ ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంలో మా ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా అనేక సేవ,కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపమని గుర్తు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మీరు బాగా చదువుకొని ఈ సమాజానికి,మీ తల్లిదండ్రులకు, మీకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి, శ్రీనివాస్,సదానంద్ యాదవ్, ఆంజనేయులు సాగర్,శ్రీశైలం,రాజు యాదవ్,కుమార్,శ్రీకాంత్,అరుణ్ కుమార్, చంద్రశేఖర్,లక్ష్మణ్,పద్మ తదితరులు పాల్గొన్నారు.