calender_icon.png 25 August, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ప్రజా ప్రభుత్వమా, నియంత పాలనా..?

16-12-2024 03:57:18 PM

ప్రభుత్వానికి సోయిలేదు: కేటీఆర్

హైదరాబాద్: తమ భూమి తమకే కావాలని అడిగిన గిరిజన రైతులకు జైల్లో పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ రైతులు జైల్లోనే ఉంటే ప్రభుత్వానికి సోయిలేదని విమర్శించారు. రైతుల కంటే పర్యాటకానికే ప్రభుత్వ ప్రాధాన్యమా?, భూమి ఇవ్వని రైతులను జైల్లో పెడతారా? అని  ప్రశ్నించారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా, నియంత పాలనా? అన్నారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ద్వజమెత్తారు. పోలీసులను వెంటవేసుకుని ప్రజలను తిరుపతిరెడ్డి భయపెడుతున్నారని కేటీఆర్ సూచించారు. శాసనసభ నడిచినన్ని రోజుల రైతు సమస్యలపైనే పోరాడుతామన్నారు. రైతు హీర్యానాయక్ కు గుండెపోటు వస్తే బేడీలతో ఆస్పత్రికి తీసుకెళ్లారన్న కేటీఆర్ రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.