27-09-2025 07:34:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బండారు పార్థసారథి నియమితులయ్యారు. మహబూబాబాద్ ఎంపీఓగా పనిచేస్తున్న పార్థసారధికి ఇనుగుర్తి ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇనుగుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పార్థసారధికి కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.