27-09-2025 07:38:45 PM
రామకృష్ణాపూర్,(విజయాక్రాంతి): క్షయవ్యాధిపై సామాజిక అవగాహన కలిగి ఉండాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ కమీషనర్ రాజు అన్నారు. మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రెండోవ వార్డులో ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా మున్సిపాలిటీ కమీషనర్ రాజు ఈ కార్యక్రమన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైద్య అధికారి జాహ్నవి మాట్లాడుతూ క్షయ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంవల్ల చాలా మంది వ్యాధి భారిన పడి ఇబ్బందులు పడుతున్నారని,క్షయ వ్యాధి నిర్ధారణే, నివారణకు మార్గమని అన్నారు.వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, వ్యాధి ప్రాథమిక దశలోనే చికిత్స పొంది ప్రతిరోజు మందులు తీసుకుని, సరైన పౌష్ఠికాహారం తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చన్నారు.క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల రూ.వేయి చొప్పున పోషణ భత్యాన్ని అందిస్తుందని తెలిపారు.