21-12-2025 12:23:41 AM
ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
మహబూబాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని చారి త్రక దేవాలయం ఐలోని మల్లన్న జాతర వచ్చే ఏడాది జనవరి 13 నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు సౌకర్యాలు, వసతులు, రవాణా, బందోబస్తు తదితర అంశాలపై శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్ధన్న పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ రాజు, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతర ప్రచార పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లా డుతూ భక్తులకు జాతర సందర్భంగా ఎలాం టి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించాలని, ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించాలని, చలు వ పందిళ్లు ఏర్పాటు చేయాలని, రహదారి, పార్కింగ్ సౌకర్యం, వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా పటిష్ట ప్రణాళిక రూపొందిం చుకోవాలని ఆదేశించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, సామాన్య భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, జాతర నిర్వహణలో భాగస్వామ్యు లయ్యే శాఖల అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమన్వయంతో జాతర విజయవంతానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, డీసీపీ అంకిత్ కుమార్, ట్రయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌ డ్, ఈవో సుధాకర్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.