21-12-2025 12:55:37 AM
పాత పెన్షన్ అమలు చేయాలి
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల చెల్లింపులో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంత? ఉందో చెప్పాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూ నియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర నోడల్ కార్యాలయ ప్రాంగణంలో పోరు దీక్ష నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థితప్రజ్ఞ మాట్లాడుతూ పెండింగ్ డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలని, మ్యానిఫెస్టో లో ప్రకటించినట్లుగా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశా రు. నెలకు రూ.700 కోట్లు పెండింగ్ బిల్లులకు ఇస్తున్నామంటున్న ప్రభుత్వం, అందులో సీపీఎస్ ఉద్యోగులకు నెలకు రూ.100 కోట్లు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వమున్నదా? అని, సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, శ్యామ్ సుందర్, పవన్, సత్యనారాయణ పాల్గొన్నారు.