calender_icon.png 7 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

06-01-2026 01:09:50 AM

విద్యాశాఖ ఉత్తర్వులు 

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఈ నెల 10 నుంచి 16 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులిచ్చారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో 16వ తేదీ (కనుమ) ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడంతో సెలవుల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా సెలవులను 16వ తేదీ నాడు కూడా సెలవు ప్రకటించారు. అంటే 10 (ఆదివారం) నుంచి 16 వరకు బడులకు సెలవులుంటాయి. 17 నుంచి బడులు మళ్లీ తెరుచుకుంటాయి.