calender_icon.png 7 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

06-01-2026 01:08:22 AM

నిర్మల్, జనవరి 5 (విజయక్రాంతి): జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లాకు చెందిన విద్యార్థులను కలెక్టర్ అభిలాష అభినవ్, కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం అభినందించారు. యువజన ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పాటల పోటీలలో విద్యార్థులు, ఏ. మంజు ల, ఎస్. కావ్య, టి. శ్రుతి, కె. అనుష్క, టి. సాత్విక, సాయికృప, బి.గంగామణి, ఆర్. శ్రీనిధి, పి. శివప్రసాద్, ఎస్.బ్రహ్మయ్యల బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచింది.

వీరు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని కలెక్టర్ అభినందించారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పాటల పోటీలలో సత్తా చాటి, జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.