03-07-2024 03:28:58 AM
జయశంకర్ భూపాలపల్లి, జూలై 2 (విజయక్రాంతి): ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎండోమెంట్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి రాజీపడకుండా పనిచేయాలని ఆదేశించారు.
రేగొండ మండలంలోని కొవడటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, చిట్యాల మండలం నైన్‌పాక నాపాక ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎండోమెంట్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ సునీత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్‌రావు, ఏఈ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.