22-12-2025 01:45:49 AM
గ్రామపంచాయతీ సర్పంచ్ నైన.. అను నేను..
పదవి స్వీకారానికి సర్పంచుల ఏర్పాట్లు
ప్రత్యేక అధికారుల పాలనకుతెర
మహబూబాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాల్లో సోమవారం పదవి స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు తొలుత ఈనెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని అనివా ర్య కారణాలు, ముహూర్తాలు సరిగా లేవనే విజ్ఞప్తుల మేరకు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు మండల పరిషత్ అధికారులు నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకమండలి ప్రతినిధులతో గ్రామ ప్రత్యేక అధికారి సమక్షంలో తొలి సమావేశం నిర్వహించి పదవి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించా లని పంచాయతీ కార్యదర్శులకు సూచించా రు.
ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల సర్పంచులు సోమవారం ఉదయం 10 నుండి మధ్యా హ్నం 12 గంటల వరకు పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చాలా చోట్ల పంచాయతీ కా ర్యాలయాలకు కొత్తగా రంగులు వేయించి ముస్తాబు చేశారు. మరికొన్నిచోట్ల కొత్తగా స ర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు ఉపసర్పం చ్ కోసం ఫర్నిచర్ కొనుగోలు చేశారు. పం డగ వాతావరణం లో సర్పంచ్ పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుండి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది.