calender_icon.png 6 May, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం పథకాలపై సమీక్ష నిర్వహించిన సత్తుపల్లి ఎమ్మెల్యే

06-05-2025 01:02:42 AM

నియోజకవర్గం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంపీవో, పంచాయితీ కార్యదర్శిలతో సమీక్ష

కల్లూరు, మే 5 (విజయక్రాంతి): తెలంగా ణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుపై సత్తుపల్లి ఎమ్మెల్యే అధికారులు తో మట్ట రాగమయి ప్రయాణం సమీక్షా స మావేశం నిర్వహించారు. నియోజకవర్గం లో ఐదు మండలాల  గ్రామ, గ్రామాన ప్ర భుత్వ అభివృద్ధి కార్యక్రమాలుపై  వరి కొనుగోలు కేంద్రం, రేషన్ కార్డు లు, రేషన్ సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, ఉపాధి హామీ కూలీలు గు రించి ఈ సమావేశం లో చర్చించారు.

వరి కొనుగోలు కేంద్రం లో ప్రభుత్వం  రైతు ల నుండి వరి కొనుగోలు చేసిన, చేస్తున్న వివరాలు సంబంధిత అధికారులు ద్వారా వివ రాలు తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్న సంఘటనలు గురించి అధికారులుతో మాట్లాడారు.అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రం లో రైతులకు ఎలాంటి  ఇబ్బందులు తలేత్తకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు రవాణా కు వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లా డి ఇంకా లోడింగ్ కు లారీలు మాట్లాడాలని అధికారులు కు తెలిపారు.

ప్రతి రేషన్ షాప్ లో గతం లో మిగిలిన రేషన్ స్టాక్ బియ్యం వివరాలు సేకరించి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. గత నేల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో పేద ప్రజలు కోసం అందిస్తున్న సన్న బియ్యం ఒక్క గింజ కూడా దగా కాకూడదు అని, ప్రతి నేల రేషన్ డీలర్లు నుండి స్టాక్ వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు.ఎవరైనా రేషన్  డీలర్లు రేషన్ బియ్యం ను అమ్ముకున్నట్లు తెలిస్తే ఉపేక్షేంచిదే లేదన్నారు. 

ప్రజా పాలనలో మరియు మీ సేవా సెంటర్ రేషన్ కార్డులు గురించి లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తు లు గురించి వివరాలు సేకరించారు. కొంతమంది అనర్హులు అని రేషన్ కార్డ్ నాన్ ఎలిజిబుల్ లిస్ట్ గురించి వివరాలు ఇవ్వాలి అని అధికారులు కు తెలిపారు.అనర్హులు లిస్ట్ కూడా మళ్ళీ పరిశీలించి అర్హత ఉంటే రేషన్ కార్డ్ లు ఇవ్వటం జరుగుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.జూన్ 2 వ తారీకు రేషన్ కార్డ్ లను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభు త్వం ఇవ్వటం జరుగుతుంది అని ఆమె తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు- తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం పేద వాడి ఇంటి కల iనెరవేరుస్తుం ది. అధికారులు లబ్ధిదారులకు అండగా ఉం డండి. ప్రతి గ్రామంలో, పట్టణం లో ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో  అధికారులు, ఇందిరమ్మ కమిటీ సమన్వయం తో  పని  చేయాలన్నారు. రాజీవ్ యువ వి కాసం పథకం క్రింద  మండలా లో ఆన్లైన్ చేసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు.

కార్పొరేషన్ ద్వారా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ  ఆన్లైన్ వివరాలు తెలుసుకొని, లబ్ధిదా రులు ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలి అని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, నియోజకవర్గం ఐదు మండలాల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీవో, పం చాయితీ కార్యదర్శిలు, మార్కెట్ చైర్మన్ ఆ నంద బాబు, బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు ఏను గు సత్యం బాబు పాల్గొన్నారు.