సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

27-04-2024 12:30:00 AM

సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మే 10న గ్రాండ్‌గా రిలీజ్ అవనుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని విడుదల చేస్తున్నాయి.

‘కృష్ణమ్మ’ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరా రాజ్ నటించగా   లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో కనపడనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ మరియు లిరికల్స్ రూపంలో విడుదలైన ‘కృష్ణమ్మ’ టైటిల్ సాంగ్, ఏమవుతుందో మనలో.., దుర్గమ్మ పాటలకు చక్కటి ఆదరణ లభించింది. ‘కృష్ణమ్మ’ సత్యదేవ్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.