కళ్యాణం కానున్నదా..?

27-04-2024 12:15:00 AM

టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోయిన్ల నుండి ఈ సౌండ్ మరింత ఎక్కువగా వినపడుతోంది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మేఘా ఆకాశ్ కూడా చేరిందన్న వార్తలు ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోలు వీటికి మరింత బలాన్నిస్తున్నాయి. నిండైన చీరకట్టు, చేతులకు మెహిందీతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న మేఘా ఆకాశ్ వాటికి వెడ్డింగ్ వైబ్స్ అంటూ హ్యాష్‌ట్యాగ్ జతపరిచింది.

ఈ నేపథ్యం లో ఆమె పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు మొదలయ్యాయి. మరో వైపు ఇదంతా ఒకానొక సంస్థతో ప్రచారం కోసం మేఘ చేసుకున్న ఒప్పందంలో భాగం అని కూడా టాక్ నడుస్తోంది. ఇది ‘కళ్యాణమా.. ప్రచారమా’ అన్నది ప్రస్తుతానికి అస్పష్టం. ‘లై’ చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మేఘా, సరైన బ్రేక్ రానప్పటికీ అడపాదడపా అవకాశాలనైతే అందుకుంటోంది.