calender_icon.png 30 August, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వైకండోలో మెడల్స్ సాదించిన విద్యార్థులు

29-08-2025 11:35:06 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మేజర్ ద్యానచంద్ జయంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జిల్లా యువజన,క్రీడా శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా తైక్వాండో క్రీడా పోటీల్లో కొత్తగూడెం తైక్వాండో క్రీడాకారులు అండర్-9 గర్ల్స్ లో హఫ్సా ఫాతిమా బంగారు,పి.అధితి ప్రియ రజత,డి.భవంతి కాంస్య,అండర్-10 లో కె.సహస్ర బంగారు,ఎల్ నాగ జేశ్విత రజత,పుండరీకాక్ష కాంస్య,అండర్-11 జి.మన్విత బంగారు,జె ప్రశాంతి రజత, ఎస్.కె సైమా కాంస్య పతకాలు సాధించినట్లు,

పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మెడల్స్ ప్రధానం చేసి క్రీడాకారులను అభినందించి, భవిష్యత్తులో ఇంకా సాధన చేసి రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు పేరు,ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించినట్లు తైక్వాండో కోచ్ లు ఎం.డీ.షమీఉద్దిన్, రమేష్ లు తెలిపారు. ఈకార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,బాక్సింగ్ జిల్లా చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్,యాకూబ్ మాస్టర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.