calender_icon.png 30 August, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధిత పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

29-08-2025 11:30:57 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అధిక వర్షాల వల్ల సంభవించిన వరద నష్టం అనంతరం ఆయా పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. అధిక వర్షాలతో ముంపుకు గురైన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీలో  పర్యటించి ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలుగకుండా చేపట్టిన విద్యుత్, డ్రైనేజ్, త్రాగునీరు సరఫరా, రహదారుల పునరుద్దరణ తదితర పనులను వేగవంతం చెయ్యాలని సంభందిత అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని పెద్ద చెరువును  సందర్శించి  వాటర్ ఫిల్టర్ ను పరిశీలించి కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా శుద్ధి చేసిన త్రాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని  బిక్కనూర్ వాగుపై గల చెక్ డ్యాంను  పరిశీలించి వెంటనే మారమ్మత్తు పనులు పూర్తి నీరు నిలువ ఉండేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బిక్నూరు మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన  వరద బాధితుల పునరావాస కేంద్రమును పరిశీలించి ప్రజలకు కల్పించిన సౌకర్యాలపై  అరా తీసి పునరావాస కేంద్రాలలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామం వద్ద కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిలో  ఆర్ &బి రోడ్డును  క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులను  పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  మూడు రోజుల నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేసి  ఎలాంటి సమస్య వచ్చిన  ప్రజలకు ఇబ్బంది సహాయక చర్యల కోసం జిల్లాలో నాలుగు ఎస్.డి.ఆర్.ఎఫ్ మరియు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని, జిల్లా కేంద్రంలోని ముంపుకు గురైన జిఆర్ కాలనీలో ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన  పునరావాస కేంద్రాలలో  అన్ని సౌకర్యాలు కల్పించి  వేడి వేడి ఆహారాన్ని, శుద్ధమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని, దెబ్బ తిన్న రహదారులు, విద్యుత్ సరఫరా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించబడుతున్నాయని తెలిపారు.