29-08-2025 11:25:59 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మొఘ గ్రామ కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరికలు శుక్రవారం పార్టీ ఆఫీస్ లో మొఘ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాని మీయ బల్లురే శ్రీనివాస్ రాజు మహారాజ్ రఫీక్ బిఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ డోంగ్లీ అధ్యక్షుడు విజయ్ పటేల్ మద్నూర్ మాజీ సర్పంచ్ సురేష్ చిన్న శక్కారగా మాజీ సర్పంచ్ గఫ్ఫార్ బి ఆర్ ఎస్ మద్నూర్ మండల ప్రియదర్శి గోవింద్ పటేల్ సుల్తాన్ మిర్జా హన్మంత్ రావు శివ కుమార్ పటేల్ బషీర్ వున్నారు.