05-10-2025 05:04:21 PM
ఐసిఈయు సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి డి.యస్.రఘు..
నకిరేకల్ (విజయక్రాంతి): బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(అఖిల భారత బీమా ఉద్యోగులు సంఘం) పోరాట ఫలితమే అని సంఘం సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డీ.ఎస్.రఘు అన్నారు. ఐసిఈయు నల్లగొండ 1, 2, ఎల్ఐసీ శాఖల సాధారణ సర్వసభ్య సమావేశం పట్టణంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కామ్రేడ్ డి.యస్. రఘు మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తులు ఇవ్వడంతో పాటు ఎన్నో ఆందోళనలు చేశామన్నారు. ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చే న్యూ లేబర్ కోర్టులను రద్దు చేయాలని, 100% యప్.డి.ఐ. పెంపుదలను ఉపసహరించుకోవాలని ఈ సందర్భంగా డి.ఎస్ రఘు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఐసిఈయు డివిజన్ కోశాధికారి జావీద్, నల్లగొండ జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాళ్ళ బాల స్వామి, డివిజన్ నాయకులు గడ్డం నవీన్ దాస్, బి.రాములు యాదవ్, బెల్లంకొండ కన్నయ్య, బ్రాంచ్ 1, 2 అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, పోలె లింగయ్య, వేముల కృష్ణయ్య వేముల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ మేనేజర్లు గౌరు శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వర రెడ్డి, ఎంతో శ్యాంబాబు, లియాఫీ నాయకులు నరేందర్ రెడ్డి, రావుల వీరయ్య, ఏఓఔ నాయకులు నలపరాజు సైదులు, దారం వెంకన్న, క్లియా ఏజెంట్లు నాయకులు బి.రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాంచ్ వన్ టూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొప్పు వెంకన్న, ఏ.కరుణాకర్ రావు, కార్యదర్శులుగా ఐతగోని లక్ష్మీనారాయణ, సి.హెచ్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.