14-08-2025 11:40:03 PM
అక్టోబర్ 1 నుండి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బంద్ పెడతాం: ఏఐటీయూసీ రాష్ట కార్యదర్శి నరాటి ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించే వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో అక్టోబర్ 1 నుండి రాష్ట్ర మొత్తం అన్ని పాఠశాలలో మిడ్ డే మీల్ బంద్ నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్(AITUC State Secretary Narati Prasad) హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరాటి ప్రసాద్ మాట్లాడుతూ, రెక్కల కష్టంతో వంటకి కావల్సిన నిత్యావసర సరుకులు కోసం పెట్టుబడి పెట్టి, విద్యార్థుల కడుపు నింపుతున్న కార్మికులకు ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి, బిల్స్ ఇవ్వకుండా జాప్యం చేయటం, నెలల తరబడి అప్పుల భారంతో తీవ్రంగా వత్తిడికి గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ లో కోడిగుడ్డు ధర రూ 7 ఉంటే ప్రభుత్వం రూ 5 ఇస్తే మిగతా నష్టం ఎవరూ బారాయించాలనీ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే మెనూ ధరలు సవరణ చేసి ప్రతి విద్యార్థికి రూ 25 చెల్లించాలని, కార్మికులు పి ఎఫ్. ఇన్సూరెన్స్. హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఈఓ నాగలక్మికి సమస్యలుతో కూడిన వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వర్లు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తేన్న పల్లి విజయ లక్మి, ప్రభావతి, మంగ, పద్మ, బుజమ్మ. క్రాంతి, స్వప్న, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.