calender_icon.png 17 May, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవుని భూములు అన్యాక్రాంతం!

17-05-2025 12:00:00 AM

  1. యథేచ్ఛగా పంటల సాగు
  2. సీతారామ ప్రాజెక్టులో ఆక్రమణ భూములకు నష్టపరిహారం
  3. చోద్యం చూస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు 
  4. సర్వే నిర్వహించి భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రజల డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం మే 16 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురె డ్డిపల్లిలో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వా మి దేవస్థానం దేవాదాయ భూములు అ న్యాక్రాంతమవుతున్నాయనే ఆరోపణలు వెలబడుతున్నాయి.

ఆక్రమిత భూముల్లో ఏదేచ్ఛగా పామాయిల్, పత్తి, మామిడి, జీడి మామిడి, వరి, మొక్కజొన్న, జామాయిల్ సాగు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమిత భూ ములకు రెవెన్యూ ,విద్యుత్ శాఖ అధికారులు ప్రోత్సాహాలు మెండుగా ఉన్నాయని సర్వత్ర చర్చనీయాంశమైంది.

రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేస్తుంటే, విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్ష న్లు ఇచ్చు సహకరిస్తున్నారని, అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వెలబడుతున్నాయి. సర్వే నంబర్ 39,40 లో దేవాలయానికి సు మా రు 2 నుంచి 3 వేల వరకు ఎకరాల భూమి ఉందనీ స్థానికులు చెబుతున్నారు.

స్వామివారి ఆలయానికి ఉన్న భూముల వివరాలు

అన్నపురెడ్డిపల్లి గ్రామంలో 23. 18 ఎకరాల మా గాని, 8 ఎకరాల మెట్ట,దేవస్థానం మైదానం 4.22 ఎకరాలు, టిటిడి సత్రం 0.27 ఎకరాలు, మొత్తం 36. 27 ఎకరాల భూమి. అన్న దైవం గ్రామంలో 450 ఎకరాలు సాగులో ఉన్న మాగానీ, 715 ఎకరాలు మెట్ట భూమి, 480 ఎకరాలు అడవిగా పుణ్యభూమి, 24 ఎకరాలు అన్న దైవం ప్రాజెక్టు ముంపు కింద ఉన్న భూమి, 134 .18 ఎకరాలు రాత్రి గుట్టల కింద ఉన్న భూమి. మొత్తం 1983 .18 ఎకరాల భూమి. 

నామవరం గ్రామంలో 1.04 ఎకరాల మెట్ట భూమి

 వేంసూరు మండలంలో అమ్మపాలెం గ్రామంలో 16. 12 ఎకరాల పచ్చకబేడుగా ఉన్న భూమి. మొత్తం 20 37. 21 ఎకరాల స్థిరాస్తి బొమ్మల రూపంలో ఆలయముకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమితో దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్న అధికారులు ఏమి పట్టనట్టు  వ్యవహరిస్తున్నారనీ తెలుస్తోంది.

వందల ఎకరాలు ఆక్రమణ గురైన దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పై అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి.దేవాదాయ భూములను కొంతమంది రైతులు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న రైతులకు రాజకీయ అండదండలతో అడ్డదారిన రెవెన్యూ శాఖ పట్టాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం సర్వేనెంబర్ 40 లోని దేవాదాయ భూముల నుంచి కా లువ తీశారు. దీంతో కౌలు రైతుల పేరున నష్టపరిహారం రావడం తో వ్యవహారం వెలు గు చూసింది. దేవాదాయ భూముల సర్వే లో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడం వల్లనే భూ అక్రమలు జోరుగా సాగుతున్నాయనీ తోంది.

దేవాదాయ భూముల ఆకరణపై సర్వే నిర్వహించి హద్దులు పాతాళని ప్రజలు ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారు ల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారిందని, ధన బలం రాజకీయ బలంతో ఆక్ర మణ భూములను తమకు నచ్చిన విధంగా మలు చుకుంటున్నారని, హక్కు పత్రాలు పొందుతున్నారని, కొందరు ఆ భూములను ఆక్రమిక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని  ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారు లు అన్నదైవం భూములపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీన పర్చుకోవాలని అన్నపురెడ్డిపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దేవాలయ భూములు ఆక్రమణ కాలేదు 

దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ పై ఈవో పాకాల వెంకటరమణ వివరణ కో రగా దేవాలయానికి సర్వేనెంబర్ 39 లో గల 2037.21 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉందని, ఒక్క గజం కూడా ఆక్ర మణ జరగలేదని,కౌలు రైతులు సక్రమంగా కౌలు చెల్లిస్తున్నారన్నారు. కొంతమంది అక్ర మ నిర్మాణాలకు ప్రయత్నిస్తే నోటీసులు జారీ చేశామని,  వివాదం కోర్టులో ఉందన్నారు.

సర్వేనెంబర్ 40 లో దాత 200 ఎక రాలను దేవాలయానికి అగ్రిమెంట్ చేశారని, దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే చేసి హద్దులు గుర్తించి తమకు అప్పగించాలని కలెక్టర్కు లేఖను అందజేసినట్లు తెలిపారు. రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆక్రమణదారులకు హక్కులు కల్పించవద్దని కోరామన్నారు.

 పాకాల వెంకటరమణ, ఈవో