13-12-2025 04:40:01 PM
- ఈ పనులు చేస్తా అంటూ బాండ్ పేపర్ ప్రకటన
- లింగుపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకట్ రాములు
కోయిల్ కొండ: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిబద్ధతతో పనిచేస్తానని లింగుపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకట రాములు అన్నారు. ఈ సందర్భంగా 'విజయక్రాంతి దినపత్రిక'తో మాట్లాడుతూ డబ్బులకు లొంగకుండా పనిచేసే అభ్యర్థికి పూర్తి మద్దతు తెలియజేయాలని ఓటర్లను కోరారు. దోచుకునే వాళ్లే డబ్బులు ఖర్చు పెడతారని తెలియజేశారు. గ్రామంలో ఏండ్ల తరబడి నివాసం ఉండడంతో ఏ వార్డులో ఏ సమస్య ఉందో పూర్తి స్థాయిలో పట్టు ఉందని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని భరోసా కల్పించారు.
ఒట్టి మాటలు కాకుండా నాకు ఓటేసి గెలిపిస్తే ఈ పనులు కచ్చితంగా చేస్తానని బాండ్ పేపర్ లో రాతపూర్వకంగా రాసి బహిరంగంగా ప్రకటన చేసి అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నారని గ్రామస్తులే చెబుతున్న మాట. ఇంత నిబద్ధతతో కూడిన వ్యక్తి సర్పంచ్ అయితే గ్రామంతో పాటు ప్రతి ఇల్లు బాగుపడుతుందని చెప్పడంతో గ్రామస్తులు వెంకట్ రాములు వైపు చూస్తున్నారు. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో వెంకట రాములు అత్యధిక ఓట్లు నమోదు చేసుకుంటారని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.