calender_icon.png 13 December, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి బోల్తా పడిన బొలెరో వాహనం..

13-12-2025 04:33:20 PM

ఐదుగురికి స్వల్ప గాయాలు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారుజామున బొలెరో వాహనం టైరు పగిలి  బోల్తా పడటంతో ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. చంద్రపూర్ నుండి సుల్తానాబాద్ కు వాహనంలో పొలం పనుల కోసం వస్తున్న కూలీలు ఈ ప్రమాదానికి గురయ్యారు. కూలీలు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన వారు.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108 వాహనంలో గాయలకు గురైన వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బొలెరో వాహనం బోల్తాపడిన సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు ఎస్సై చంద్రకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.