13-12-2025 04:44:22 PM
అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలి..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అఫ్సర్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. గ్రామ అభివృద్ధి చేసే అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచుగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు ఎండీ అఫ్సర్ అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కన్నాయిగూడెం మండలంలో అన్ని గ్రామల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులకు, వార్డు సభ్యులకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామాల్లో ఉన్న ఓటర్లకు తెలిపారు. ఈ సందర్భంగా మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ అభ్యర్థులకు వేసి గ్రామ అభివృద్ధి పాటుపడాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తుందని తెలిపారు.
కన్నాయిగూడెం మండలంలో ప్రతి గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామ సర్పంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సర్పంచు అభ్యర్థులు కష్టపడే మనస్తత్వం ఉన్నవారని, పేదింటి బిడ్డలు అని మంచి చేసే వ్యక్తులు అని ప్రజలందరూ గమనించాలని మా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనాక మహిళలను కోటీశ్వరురాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మహిళలకు పెట్రోల్ బంకు, సోలార్ పవర్ బస్సులు, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని అలాగే ఇప్పటివరకు గ్రామంలో 24 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియని అన్నారు. గ్రామాల్లో ఉన్న ఓటర్లకు తెలిపారు.