calender_icon.png 6 August, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలతో సెక్రటరీలు సతమతం

06-08-2025 12:00:00 AM

  1. 18 నెలలుగా నో ఫండ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,031 మంది సెక్రటరీల వెతలు 

ఖమ్మం, ఆగస్ట్ 5 (విజయ క్రాంతి): కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గత 18 నెలలుగా పంచాయితీలకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వటం లే దు. గత ప్రభుత్వం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల నిధులు పంచాయతీలకు అందాయి. చి వరి ఏడాదిలో ఒక్క కేంద్రం నిధులు మా త్రమే వచ్చాయి. ఇక ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏ నిధులు పంచాయతీలకు రాలేదు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 1030 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు గత 18 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన నిధు లు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఒక పక్క సర్పంచులు లేరు. మరోపక్క రూపాయి నిధులు కూడా లేవు దీంతో ఆ పంచాయతీ కార్యదర్శుల వేతలు వర్ణనాతీతంగా ఉన్నా యి. పంచాయతీలో వాటర్ సమస్య వచ్చిన, మోటార్ల సమస్య వచ్చినా, స్ట్రీట్ లైట్లు సమ స్య వచ్చిన,

పారిశుద్ధ్యంలో సమస్య వచ్చినా సెక్రటరీలు వారి జేబులోని డబ్బులు తీసి పనులు చేపించాల్సిన పరిస్థితి నెలకొంది. మైకుల ముందు వుదరగొట్టే నాయకులు- స మస్యలు పట్టించుకోరు ఏ ప్రజా ప్రతినిధి అ యిన మైకులు ముందు మీ గ్రామానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రసంగించే వారే కానీ, పంచాయతీకి ఒక్క రూపాయి వచ్చే ఏర్పాటు చేసే వారు లేరని పంచాయతీ కా ర్యదర్శులు అంటున్నారు.

ప్రమాదల బారిన కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి ఎక్కువే. గ్రామంలో ఏ కార్యక్రమానికైనా వీరు ముందుండి చేయాల్సిందే. అన్నీ చేసినా, పై వారితో వీరికి చివాట్లు కూ డా తప్పడం లేదు. ఈ ఏడాది జూన్ నెలలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కు చెంది న ఒక పంచాయతీ కార్యదర్శి డ్యూటీ నిమి త్తం వెళ్తుండగా యాక్సిడెంట్ అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

గతం లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండ లం లో పనిచేసే ఒక పంచాయతీ కార్యదర్శి సాయంత్రం పంచాయతీ కార్యాలయం నుం చి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. అదే నెలలో ఇల్లందుకు చెందిన ఒక కార్యదర్శి కి డ్యూటీలో ఉండగా యాక్సిడెంట్ జరిగింది. పంచాయతీ అభివృద్ధికి వివిధ రకాల పనులు ఉండడంతో వీరి ప్రమేయం అన్ని పనుల్లో ఉంటుంది.

దింతో కొందరు సెక్రటరీలు పని ఒత్తిడికి లోనవుతున్నారని కార్యదర్శులు చె బుతున్నారు. ఉదయం 8:00 గంటలకే ఫోటోలు యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉందని కార్య దర్శులు చెబుతున్నారు.అప్పులు చేసి నెట్టకొస్తున్నాం పంచాయతీల్లో వివిధ రకాల పను లకు నిధులు లేక అప్పులు చేసి పనులను నెట్టుకొస్తున్నామని,

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను కమిటి ఎన్నుకొన్నప్పటికి కొన్ని సం దర్భాల్లో ప్రజలు వారి పేరు లేదని మమ్మలను నిందిస్తున్నారని కార్యదర్శులు అంటు న్నారు.  ఉద్యోగాలు నిలబెట్టుకోడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని ఇప్పటికైనా పంచాయతీలకు నిధులు వచ్చే లా చూడాలని కార్యదర్శులు కోరుతున్నారు.