calender_icon.png 6 August, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఎంపి వైద్యం వికటించి వ్యక్తి మృతి

05-08-2025 11:47:28 PM

వైద్యశాల ముందు బంధువులు గ్రామస్తుల ఆందోళన

మునగాల,(విజయక్రాంతి): వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మండల పరిధిలో చోటుచేసుకుంది, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం  బరాత్  గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు(38) అనే యువకుడు మంగళవారం  జ్వరం రావడంతో తన భార్యను తీసుకొని మునగాల గ్రామంలోని  ఒక ప్రైవేటు వైద్యశాలకు రాగా, వెంటనే ఆర్ఎంపీ చంద్రమౌళి వెంకటేశ్వర్లు కు తన వైద్యశాల నందు వైద్య సహాయం అందించి ఇంజక్షన్ వేయగా వెంకటేశులు తీవ్ర అస్తవ్యస్తత గురయ్యాడు.

కాగా అస్తవ్యస్తతకు గురైన వెంకటేశ్వర్లు ను మెరుగైన వైద్య చికిత్స కోసం కోదాడ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు వెంకటేశ్వర్లు భార్య తెలపడంతో,  వెంకటేశ్వర్లు మృతి చెందిన వార్త తెలుసుకున్న బంధువులుఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని ఆర్ఎంపి వైద్యుడు చంద్రమౌళి వైద్యశాల ముందు ఆందోళన నిర్వహించారు, అనంతరం చనిపోయిన వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం జరగాలని మరియు సంబంధిత డాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, సంఘటనా స్థలాన్ని కి చేరుకున్న ఎస్ఐ  పోలీస్ సిబ్బంది బాధితులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు,