10-11-2025 12:21:01 AM
బాన్సువాడ, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 2000 2001 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ 25 సంవత్సరాల పాఠశాల విద్యార్థులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమ గురువులందరినీ కలుసుకోవడం తమకే ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. 25 సంవత్సరాలు తరువాత పూర్వ విద్యార్థులం కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. తమ పాఠశాల స్థాయిలో చేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు చిలిపి చేష్టలు గుర్తు చేసుకున్నారు.