06-12-2025 12:25:04 AM
భద్రతా చర్యలు పటిష్ఠం చేయాలి : జిల్లా ఎస్పీ
నాగర్కర్నూల్, డిసెంబర్5 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సందర్శించి, జరుగుతున్న వాహనాల తనిఖీలను స్వయంగా పరిశీలించారు.
ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా జరిగితే సీజ్ చేయాలన్నారు. ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.