06-12-2025 12:25:23 AM
హేమంత్ సోరెన్‌ను ఆహ్వానించిన అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను సీఎం హేమంత్ సోరెన్‌కు అందజేశారు.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్ సంకల్పంతో ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధోమథనం తర్వాత తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు జార్ఖండ్ సీఎంకు వివరించారు.