18-08-2024 12:00:00 AM
మనిషికి మాట ప్రకృతి ఇచ్చిన వరం. మానవ ఔన్నత్యానికి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా అనుకున్నది సాధిం చలేక మనిషి సతమతమవుతున్నాడు. తనపై తనకు నమ్మకం లేక ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నది. ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం అంతరిసే ్తఏ రంగంలో అయినా మనిషి రాణించలేడు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దృఢమైన సంకల్పం ఉంటే దేన్నైనా సాధించగలం. జాతి వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాటం చేసిన నెల్సన్ మండే లాను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యం అనిపిస్తుంది. ‘సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా..’అన్న సినీ కవి వ్యాఖ్య మనకు స్ఫూర్తి కావాలి.
మన మీద మనకు అవగాహన, విశ్వాసం ఉండాలి. ఓటమి విజయానికి మెట్టు అన్న శ్రీకృష్ణుని సందేశం మనకు బాట కావాలి. ఓటమికి కుంగిపోకుండా నీలో నీవు ప్రశ్నించుకో. తప్పులను సరిచేసుకో. విజయుడిగా నిలిచిపో. నేటి యువత అపజయాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. కన్నవారికి శోకాలు మిగులుస్తున్నారు. మానవ జన్మ అపురూపం. ఏదైనా సాధించేందుకే దైవం ఈ శరీరాన్ని ఇచ్చాడు. పాండవులు ఆత్మవిశ్వాసంతో అరణ్య, అజ్ఞాత వాసాలను పూర్తి చేసి విజయం సాధించారు. మనసులో తప్పుడు ఆలోచనలు ఉండకూడదు. మహాశయుల విజయ గాథలు మనకు స్ఫూర్తికా వాలి. పనిమీద ధ్యాస ఆత్మవిశ్వాసానికి ఆలంబన. ఆత్మవిశ్వాసం విజయానికి సోపానం.
సందేహాలు వద్దు, సంకల్పం ముద్దు. విజయాలే నీ హద్దు. శక్తి సామర్థ్యం శోధనా సాధనలే ఆత్మ విశ్వాసానికి ఆయువు పట్టు. పట్టుదల, విశ్వసనీయత, అంకితభావం విజయాల సాధనకు బాట కావాలి. ఆశయాల సాధనకై చేసే కృషి సంకల్పం, శక్తి సామర్థ్యాలే నీ కార్యాచరణ ప్రణాళిక కావాలి. అపజయాలు అనుభవాలే భవిష్యత్ విజయాలకు పునాది కావాలి. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా అభివృద్ధి పథంలో పయనించాలి. మనిషి జీవితం పోరాటాల మయం. ఏదీ తనంత తానై దరి చేరదు. శోధించాలి, సాధించాలి. పరుల హితమే
నీ అభిమతమైతే అవహేళనలు, ఆందోళనలు అంతమై మనోప్రశాంతత సంపదవుతుంది. త్యాగం, తెగింపు, కర్తవ్య నిష్ఠతో జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాలి. నిరాశ నిస్పృహలు విడనాడాలి. ఆశయాల సాధనే మన జీవిత లక్ష్యం కావాలి.
నేదునూరి కనకయ్య