calender_icon.png 19 December, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 ఏళ్ల ప్రజాసేవ ఎడ్ల చిన్న రాములు

19-12-2025 12:11:42 AM

నకిరేకల్, డిసెంబర్ 18  : కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన ఎడ్ల చిన్న రాములు గత 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో కొనసాగుతున్నారు. 2005లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, వార్డు మెంబర్గా మరియు ఉప సర్పంచ్గా పనిచేస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారు. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, తెలంగాణ ఉద్యమానంతరం టీఆర్‌ఎస్లో చేరి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

ప్రస్తుతం  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాయకత్వంలో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో చెర్వుఅన్నారం గ్రామం 1వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నెల 22న ఆయన వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజాసేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అవకాశం వస్తే సేవ కొనసాగిస్తానని ఎడ్ల చిన్న రాములు తెలిపారు.