calender_icon.png 19 December, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీకౌంటింగ్ చేయాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

19-12-2025 12:09:26 AM

ఆశ్వారావుపేట, డిసెంబరు 18 (విజయక్రాంతి): అశ్వారావుపేట మండలంలోని అనుపాక పంచాయతీలో ఓట్లు లెక్కింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థి పాయం ధనలక్ష్మి కౌటింగ్ ఏజెంట్ శ్రీనివాసులు గురువారం జిల్లా కలెక్టర్‌కు  పిర్యాదు చేసారు. రెండవ విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో బాగంగా ఆశ్వారావుపేట మండలం, అసుపాక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఇద్దరు కాంగ్రేస్ పార్టీ మద్దతుదారులు పోటీ చేసారు.

ఇందులో పాయం ధనలక్ష్మి అనే అభ్యరికి బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఓటు లెక్కింపు అనంతరం  కాంగ్రేస్ బలపరిచిన మరో అభ్యర్థి సోమె ఆదిలక్ష్మి గెలిచినట్లు అధికారులు వెలడించారు. అయితే ఓటు లెక్కింపు సమయంలో ఓటును టబ్లో పోసిన తరువాత కరంటు తీసివేసారని. కరంటు వచ్చిన తరువాత ఆదిలక్ష్మి గెలిచిందంటూ ఎన్నికల అధికారి కోర్స గణేష్ బాబుప్రకటించి, ఓడిన అభ్యర్థి, ఏజెంట్లు సంతకాలు కూడ తీసుకోకుండా బైటకు పంపించివేసారని పిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మొత్తం తతంగానికి సీఐ సహకరించారని పిర్యాదులో పేర్కొన్నారు. పోలైన ఓటుకు, లెక్కించిన ఓట్లుకు 31 ఓట్లు తేడా వచ్చాయని, ఇదెలా జరిగిందని ఎన్నికల అధికారిని అడిగితే ఓట్లు వేసినవారు బాక్సులో వేయకుండా వెళ్ళిపోయి ఉంటారని చెపుతున్నారంటూ పిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, రీ కౌంటింగ్ చేయాలంటూ కలెక్టర్‌కు పిర్యాదు చేసారు.