మాదకద్రవ్యాల నివారణపై సెమినార్
కోదాడ, జూలై 2 : కె. ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. విభాగం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాల నివారణ‘పై గురువారం సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తొలి పలుకులు తెలుగు లెక్చరర్, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారి వేముల వెంకటేశ్వర్లు పలుకగా సభాధ్యక్షత కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి వహించారు.
కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కోదాడ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొలిశెట్టి .సుధీర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ మాదకద్రవ్యాల నివారణ, రవాణాలను అరికట్టడం సమాజ శ్రేయస్సుకు అత్యవసరమని, దీనిలో యువత కీలకంగా వ్యవహరించాలని, మత్తు పదార్థాలకుదూరంగా ఉండాలని అందరికీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ డ్రగ్ కమిటీ మెంబర్ హుస్సేన్ గౌడ్, కళాశాల డ్రగ్స్ కమిటీ మెంబర్ జి. నాగరాజు, ఆర్. పిచ్చి రెడ్డి, జి.యాదగిరి, వి.బల భీమారావు, ఆర్. రమేష్, ఎం. రత్నకుమారి, బి.రమేష్,జి. వెంకన్న,కె. రామరాజు, ఎస్. కె .ముస్తఫపోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






