03-05-2025 01:52:18 AM
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): నగరంలో మెట్రోరైలు విస్తరణ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రమంత్రి ఆధ్వర్యం లో శుక్రవారం ఎంసీహెచ్ హెచ్‌ఆర్డీలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కేంద్రనిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై కేంద్రమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వ హించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్రోరైలు ప్రాజెక్టులో అఫ్జల్‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్ ను విస్తరించి..సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్రప్రభుత్వానికి పంపించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. మెట్రోరైలు వివరాలు అందితే కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, రుణాలు లభించేలా సహకరిస్తామని స్పష్టం చేశారు.
రాష్ర్ట అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీ అని.. అభివృద్ధి అంటే కేవలం హైటె క్ సిటీ కాదని.. ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అం బర్‌పేట్, సనత్‌నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని అన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పాతబస్తీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, ప్రాథమిక సౌకర్యాల సమస్యలు మరింతగా తలెత్తుతున్నాయని..
హైటెక్ సిటీతో పా టు ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందు కు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ సంస్థలు నగర మౌలిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, నిధుల కొరత లేకుండా చూ సేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. జీహెచ్‌ఎంసీ ఊహించని స్థాయి లో విస్తరిస్తూ జనాభా భారీగా పెరుగుతున్న నేప థ్యంలో మౌలికవ సతులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వట్లే..
కేంద్రం ప్రవేశపెట్టే పథకాలకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కేటాయించకపోవడం వల్లే నిధులు ఖర్చు చేయ లేని దుస్థితి ఏర్పడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికారులు రాష్ట్రంలోని సమస్యలను తమ దృష్టి కి తీసుకువస్తే కేంద్రం నుంచి ఎన్ని నిధులై నా తీసుకువస్తామని తెలిపారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల