06-09-2025 05:53:43 PM
మణుగూరు,(విజయక్రాంతి): సమా జాన్ని చైత న్యపర్చడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి అన్నారు. జర్నలిస్టడే సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్లు ఈరెల్లి కిషోర్( వార్త), మారాసు సుధీర్ (విజయక్రాంతి)లను శనివారం ఆయన తన కార్యాలయంలో శాలువాలు కప్పి పూల మొక్కను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. జర్నలిస్టు లు పేదలకు మేలు చేసే వార్తలు, కథనాలు రాయాలని సూచించారు. చట్టాలపై పేదలకు అవగాహన కల్పించేలా వార్తలు రాసి, ప్రజలను చైతన్య పరచాలన్నారు.
జర్నలిస్టులు ఎప్పుడు అద్దంలా ఉండాలని, విలువలతో కూడిన, నిజమైన వార్తలు ప్రచురించాలని అలాంటి జర్నలిజం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయ పడ్డారు. జర్నలిజం ప్రత్యేకమైన వృత్తి అని, నిలబడి ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో పత్రికరంగంలోని ప్రతి ఒక్క పాత్రికేయుడు ముందుకు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మండలంలోని జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.