calender_icon.png 6 September, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతల మయమైన రోడ్లను పరిశీలించిన ఈఈ సీతారామయ్య

06-09-2025 05:50:46 PM

తుంగతుర్తి(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం నుండి మద్దిరాలకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లతో ఇబ్బందులు పడుతున్న వాహనదారుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞాన సుందర్. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం తో శనివారం ఈ ఈ సీతారామయ్య సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 300 మీటర్ల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదలు పంపిస్తాం అని పేర్కొన్నారు. రోడ్ల పనులను మూడు, నాలుగు రోజుల్లో చేపడతామని హామీ ఇచ్చారు. కావాలని మద్దిరాల మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ అధిక లోడు వాహనాలు ఈ రోడ్డుపై నడపడంతోనే రోడ్డు ఈ స్థితికి చేకూరిందని పలువురు విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీఈ పద్మావతి, ఏఈ యుగంధర్ ఉన్నారు.