ఖమ్మం,(విజయక్రాంతి): వి.వెంకటయపాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుతూంబాక బసవనారాయణ గురువారం తెల్లవారుజామున పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బసవనారాయణ పార్దివ దేహానికి పూలమాలవేసి, ఘన నివాళులర్పించారు. ముఖ్య నాయకులు, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళా దుర్గాప్రసాద్ ,నల్లమల్ల వెంకటేశ్వరావు ,ఎర్రగర్ల హనుమంతరావు, కుతుంబాక సీతారాం తదితర ముఖ్య నాయకులు ఆయన మృతదేహానికి నివాళ్ళర్పించారు.