22-12-2025 12:00:00 AM
హాజరుకానున్న 45 వేల మంది అభ్యర్థులు
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజి బిలిటీ టెస్ట్ (టీజీ సెట్) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇప్పటికే హాల్‌టికెట్లను అధికారు లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచా రు. ఈ పరీక్షలను దాదాపు 45 వేల మంది అభ్యర్థులు రాయనున్నారు. మొ త్తం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చే శారు.
మొత్తం 29 సబ్జెక్టులకు పరీక్షలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేం ద్రానికి చేరకోవాలని సూచించారు. తెలంగాణ సెట్‌లను ఉస్మానియా యూ నివర్సిటీ నిర్వహిస్తోంది. టీజీ సెట్ పరీక్షలు మొత్తం రెండు పేపర్లకు ఉంటాయి. పేపర్- 1లో 50 ప్రశ్నలకు 100 మా ర్కులు, పేపర్- 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో పరీక్ష ఉంటుంది.