22-12-2025 12:00:00 AM
సంగారెడ్డి నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిరసన
సంగారెడ్డి, డిసెంబర్ 21: పనికి ఆహార పథకం పేరులో నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఆదివారం సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా టీజీఐఐసీ చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మాగాంధీ పేరు తొలగించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు గాంధీని అవమానించిన బీజేపీని ప్రజలు క్షమించరని అన్నారు. దేశ స్వాతంత్య్రంలో ఒక్క బీజేపీ నాయకుడు పాల్గొనలేదని, బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క న్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అ ధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బూచి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్ , తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బబు తదితరులు పాల్గొన్నారు.