calender_icon.png 11 September, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో 15 రోజులపాటు సేవా పక్షం

11-09-2025 01:39:15 AM

  1. కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు 

రైతులందరికీ సరిపడా యూరియా 

మెదక్ ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మో దీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో 15 రోజులపాటు సేవా పక్షం కార్యక్ర మాలను నిర్వహించనున్నట్లు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు తెలిపా రు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు బుధవారం మీ డియా సమావేశంలో మాట్లాడారు.

పార్టీ కా ర్యకర్తలందరూ తమ తల్లి పేరుతో ఒక మొ క్కను నాటాలని సూచించిన ఆయన, రక్తదా నం, అన్నదాన శిబిరాలతో పాటు అనేక సే వా కార్యక్రమాలను చేపట్టి మోదీపై తమకున్న ఆత్మాభిమానాన్ని తెలియజేయాలని పి లుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశం 25 కోట్ల పేదలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించిందని ఎంపీ తెలిపారు.

జి డిపిలో 11వ స్థానం నుండి మూడవ స్థానానికి భారత్ చేరుకోవడం, ప్రపంచ వేదికపై బ లంగా నిలవడం మోదీ వల్లే సాధ్యమైందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ గా తీ ర్చిదిద్దడం ప్రధాని లక్ష్యమని రఘునందన్ గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లాలోనీ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలని కమీషనర్లు ఆదేశాలు జారీ చేయాలని కోరా రు.

ఇటీవల కురిసిన వర్షాల సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నీటితో కలిసి ఇళ్లలోకి చేరి ఇబ్బందులు కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అక్రమ వెంచర్లలో ఇళ్లు ని ర్మించవద్దని, కేవలం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చే యాలని సూచించారు.

జీఎస్టీ తగ్గింపుపై కేం ద్రం తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తుందని ఎంపీ తెలిపారు. ఈ నెల 12న గజ్వేల్, 13న సిద్దిపేటలో వర్తకులు, వ్యాపారులతో సమావేశా లు నిర్వహించి ఈ అంశంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

రైతులందరికీ యూరియా.. 

రైతులు ఎదుర్కొంటున్న యూరియా స మస్యలపై ఎంపీ స్పందించారు. కేంద్రం పం పిన యూరియాను రైతులకు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమ ర్శించారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందరికీ సరిపడా యూరియా అందజేయడానికి కలెక్టర్లు, ఏవోలతో సమీక్షలు నిర్వ హించి చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు.

అంతకుముందు పార్టీ కార్యకర్తలకు జరిగిన వర్క్ షాప్ లో ఎంపీ పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, నాయకులు భాస్కర్, సంతోష్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.