calender_icon.png 13 November, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడెనిమిది గంటలు విచారణ

15-04-2025 12:12:35 AM

పెన్ను, పేపర్లు, ఖురాన్ కావాలన్న తహవూర్ రాణా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. 18 రోజుల విచారణలో భాగం గా ఎన్‌ఐఏ అధికారులు అతడిని రోజుకు 8 గంటల పాటు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తహవూర్ రాణా వైద్య పరీక్షలకు, అతడి తరఫు న్యాయవాదిని కలిసేందుకు ఎన్‌ఐఏ అధికారులు అనుమతిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు రాణా కేవలం మూడు వస్తువులను మాత్ర మే అడిగినట్లు తెలుస్తోంది. పెన్, పేపర్లు లేదా నోట్ ప్యాడ్, ఖురాన్. వాటిని అధికారులు రాణాకు అందించారు.