12-12-2025 12:19:30 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రెవెన్యూ కార్యాలయం అంతర్గత కొమ్మలాటతో కొట్టుమిట్టాడుతోంది. కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులకు మధ్య పెద్ద ఎత్తున కుమ్ములాటలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. కొంతమంది సిబ్బంది బహిరంగంగా ఈ అంశంపై చర్చించుకోవడం గమనారహం.
తాసిల్దార్ ఎదుటనే కార్యాలయంలో కుమ్ములాట జరుగుతుండడం కార్యాలయానికి వచ్చిన ప్రజానీకం ప్రత్యక్షంగా గమనించారని తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో వాటాల మధ్య వచ్చిన విభేదమా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు తెలియకుండా ఏ పనులు చేయకూడదని ఉద్యోగుల ఆధిపత్యమా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా రెవెన్యూ కార్యాలయం లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అంతుపంతు లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాటాల మధ్యన విభేదాలే కుమ్ములాటకు కారణమని చెవులు కొరుక్కుంటున్నారు.