12-12-2025 12:03:03 AM
దండేపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మండలంలో నిర్వహించిన మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలుండగా కొండాపూర్, కొత్తమామిడిపల్లి, పాత మామిడిపల్లి, ముత్యంపేట జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. నెల్కి వెంకటాపూర్, గూడెం జీపీలు ఎస్టీలకు కేటాయించగా ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు.
వందూరుగూడను నూతన జీపీగా మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించడంతో మిగిలిన 24 గ్రామ పంచాయతీలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు. 24 జీపీలకు బరిలో 75 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మండలంలో 34,213 (పురుషులు 16,660, మహిళలు 17,552) మంది ఓటర్లుండగా ఉదయం తొమ్మిది గంటల వరకు 5,548 (16%), 11 గంటల వరకు 17,845 (52%), ఒంటి గంట వరకు 25,520 (74.59%), ఒంటి గంట అనంతరం క్యూలో నిలబడిన వారు ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ 27,362 (79.98%)కి చేరుకుంది. మండల వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో 12,993 (77.99%) పురుషులుండగా, 14,368 (81.86%) మహిళలు, ఒకరు ఇతరులున్నారు.
విజయం సాధించిన సర్పంచులు వీరే...
దండేపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవం, మూడు జీపీల్లో నామినేషన్ లు వేయకపోవడంతో ఎన్నికల అధికారులు 24 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సర్పంచు స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో కొండాపూర్ గ్రామ సర్పంచిగా ఇప్ప రవళి(కాంగ్రెస్), కొత్త మామిడిపల్లిలో కస్తూరి పోషం(కాంగ్రెస్), మామిడిపల్లిలో ఆల్తపు వైష్ణవి(కాంగ్రెస్), ముత్యంపేటలో కుడిమేత తిరుపతి(కాంగ్రెస్)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అల్లీపూర్ జీపీ సర్పంచ్ గా కొత్తపల్లి కళ (కాంగ్రెస్ రెబల్), చెల్కగూడలో ఆత్రం శాంకరి (బీఆర్ఎస్), దండేపల్లిలో అజ్మీరా రాజేశ్వర్ (కాంగ్రెస్), మాకులపేటలో బోడకుంట శంకరయ్య (కాంగ్రెస్), ధర్మరావుపేటలో కొత్త ధర్మయ్య (కాంగ్రెస్), ద్వారకలో ముడిమడిగుల సత్య నారాయణ (కాంగ్రెస్), గుడిరేవులో శాంతపురి కళావతి (కాంగ్రెస్), కన్నెపల్లిలో చుంచు నాగేష్ (కాంగ్రెస్), కర్ణపేటలో అజ్మీరా సుభాష్ (ఇండిపెండెంట్), కొర్విచెల్మలో సారల సోనియా (కాంగ్రెస్), లక్ష్మీకాంతాపూర్ లో చిలుకూరి మహేష్ (కాంగ్రెస్), లింగాపూర్ లో మగ్గిడి శంకరమ్మ (ఇండిపెండెంట్), మేదరిపేటలో చొప్పదండి అనూష (కాంగ్రెస్), నాగసముద్రంలో నందుర్గా సుగుణ (బీజేపీ), నంబాలలో గోపు రాజమల్లు (బీజేపీ), నర్సాపూర్ లో తీగల రాజన్న (కాంగ్రెస్), పెద్దపేటలో పెంట సత్తయ్య (కాంగ్రెస్ రెబల్), రాజుగూడలో జె రాజవ్వ (కాంగ్రెస్ రెబల్), రెబ్బనపల్లిలో కందుల కళ్యాణి (కాంగ్రెస్), తానిమడుగులో మలావత్ నందిని (కాంగ్రెస్), వెల్గానూర్ గ్రామ సర్పంచిగా మొరుపుటాల మానస (బిజెపి), తాళ్ళపేటలో కుర్షింగా కళావతి (కాంగ్రెస్ రెబల్), కాసిపేటలో లక్కాకుల అనితా ( కాంగ్రెస్), చింతపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అక్కల సత్య నారాయణ (కాంగ్రెస్ రెబల్) గెలుపొందారు. మండలంలో 278 వార్డులకుగాను 103 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 32 వార్డులకు నామినేషన్ లు దాఖలు కాకపోవడంతో 143 వార్డులకు ఎన్నికలు జరుగగా 435 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.