12-12-2025 12:18:50 AM
చొప్పదండి, డిసెంబర్11 (విజయ క్రాంతి): మండలంలో గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు విలేకరులు పోలింగ్ సరళి సమాచారం తెలుసుకుందామని వెళితే, కేంద్రాల వద్దకు విలేకరులు అస లే రావద్దని బెదిరించి పంపించారు. విలేకరి తనకున్న ఐడి కార్డు చూపించిన విలేకరులు ఇక్కడికి వచ్చే అవసరం లేదని ఫోటోలు తీ యవద్దని బెదిరించి ఫోను లాక్కున్నారు. అ క్కడున్న గ్రామస్తులు చెప్పిన వినకుండా ఏ మి చేస్తారో చేసుకోండి అని బెదిరించారు.
మండల రిపోర్టర్లు అందరు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి స్థానిక ఎస్‌ఐ నరేష్ రెడ్డి సమాచారం అందించగా పోలింగ్ కేంద్రకు వచ్చి అక్కడున్న పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేసి విలేకరి ఫోన్ ఇప్పించారు. విలేఖరి ఫోన్ లాక్కున్న పోలీస్ పై ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మండల విలేకరులుడిమాండ్‌చేశారు.