calender_icon.png 23 September, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

23-09-2025 01:04:38 AM

పూజల్లో పాల్గొన్న కేసీఆర్ సతీమణి

కొండపాక,సెప్టెంబరు 22: కొండపాక మండలం మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు క్షేత్ర నిర్వాహకులు దేవి ఉపాసకులు డాక్టర్ చెప్పేల హరినాధ శర్మ నేతృత్వంలో శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.ఉత్సవాల సందర్భంగా శతుష్షష్ఠి ఉపచార పూజ, మంగళ హారతి, నవావరణ హవనము గోపూజ జరిగాయి.

రజత కవచ అలంకరణలో విజయదుర్గమాత భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. విజయ దుర్గామాత దీక్ష తీసుకునే వారు కంకణ ధారణతో అమ్మవారి మాలను ధరించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు రవీందర్, సతీష్, సత్యం, మల్లికార్జున్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ సతీమణి ప్రత్యేక పూజలు..

ఉత్సవాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ మర్పడగ క్షేత్రాన్ని సందర్శించి విజయదుర్గమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లికార్జున స్వామికి అభిషేకము నిర్వహిం చారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు హరినాథ్ శర్మ ఆలయ మర్యాదలతోసత్కరించారు.